Tuesday, May 28, 2024

AP: కడపలో ఓటు వేసిన షర్మిల దంపతులు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సీని ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఓటు వేశారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కడపలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల దంపతులు మాట్లాడుతూ… ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాలంటే మంచి నేతలకే ఓటు వేయాలని కోరారు. కాగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. ప్ర‌జ‌లంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement