Sunday, April 28, 2024

హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే లైసెన్స్ రద్దు

టూవీలర్‌ వాహనదారులు హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.దీంతో హెల్మెట్ లేకుండా టూవీర్ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.   హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ దొరికితే తొలిసారి  మూడు నెలలపాటు లైసెన్స్‌ను రద్దు చేస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అలానే దొరికితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ప్రమాదాలు, హెల్మెట్‌ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూనే నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. డైవింగ్‌ చేస్తున్నవారితో పాటుగా వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్‌ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement