Wednesday, May 22, 2024

MDK : ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ః ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.సోమవారం పోలింగ్ డే సందర్భంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల్ ఔరంగాబాద్ ప్రాథమిక పాఠశాల 211 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రజలకు తన సందేశాన్ని తెలియజేస్తూ ఓటు హక్కు మాత్రమే కాదని బాధ్యతగా ప్రతి ఓటరు వినియోగించుకోవాలని కోరారు. పార్లమెంట్ కాన్స్టెన్సీ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని 6 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపలి ఉన్నవారికి టోకెన్లు అందించడం జరుగుతుందని వారు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement