Tuesday, July 23, 2024

తాడిపత్రిలో రణరంగం – పోలీసులు అదుపులో ఎమ్మెల్యే

పలువురికి గాయాలు
వైసీపీకి చెందిన ఐదు వాహనాలు,
టిడిపి చెందిన ఒక వాహనం ధ్వంసం

తాడిపత్రి టౌన్ – సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాడిపత్రి రణరంగంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, యువర్ వర్గాలకు చెందిన ఇరువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..ఓం శాంతి నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతు వద్ద ఘర్షణ చోటుచేసుకుందని తెలుపడంతో ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. అనంతరం టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి , జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లే తరుణంలో టిడిపి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇరువురు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.

- Advertisement -

దీంతో ఎంతో ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి రణరంగంగా మారింది. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, ఇరువర్గాలకు చెందిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిలో టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత రెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం కాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనంతో పాటు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కంది గోపుల మురళి తోపాటు వైసీపీ వర్గీయులకు చెందిన మరో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమిత్ బర్దర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement