Monday, May 13, 2024

ఏప్రిల్ 11నుండి నెట్ ప్లిక్స్ లో ‘ఉప్పెన’

ఉప్పెన చిత్రం ఈ నెల ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. క్లైమాక్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. నటీనటుల పెర్ ఫార్మెన్స్ గురించి మాత్రం యునానిమస్ గా క్లాప్స్ కొడుతున్నారు. తొలి సినిమాతోనే వైష్ణవ్ తన రేంజ్ ను చాటుకున్నాడని చెబుతున్న ఆడియన్స్.. హీరోయిన్ కృతి శెట్టి చాలా అందంగా అభినయించిందని కితాబిస్తున్నారు. మొత్తానికి అన్ని వైపుల నుంచీ వస్తున్న ఈ పాజిటివ్ బజ్ తో.. మంచి కలెక్షన్స్ సాధిస్తోందీ చిత్రం. ఓపెనింగ్స్ విషయంలో బిగ్గెస్ట్ డెబ్యూ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ప్లిక్స్  సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందుగానే ఈ అగ్రిమెంట్ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. థియేటర్ లో  విడుదలైన 60 రోజుల తర్వాతే ఈ చిత్రాన్ని నెట్ ప్లిక్స్ లో  ప్రసారం చేయాల్సి ఉంది. ఆ లెక్కన అందుతున్న అప్ డేట్  ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ 11 నుండి నెట్ ప్లిక్స్ లో  స్ట్రీమింగ్ కాబోతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement