Tuesday, May 14, 2024

JIO | జియో 5జీ ప్లాన్‌ ధరలు పెర‌గ‌నున్నాయా..

దేశంలో 5జీ టెలికం సేవలు ప్రారంభమై సంవత్సరం కావస్తోంది. ఇప్పటికే రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు దేశంలోని అన్ని ముఖ్య నగరాలు, పట్టణాలు, ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ఆయా కంపెనీలు 5జీ సేవలను 4జీ టారిఫ్‌ ప్లాన్స్‌లోనే అందిస్తున్నాయి. వోడాఫోన్‌ ఐడియా మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో 5జీ సేవలను ప్రారంభించలేదు.

ఈ మూడు కంపెనీల 5జీ స్పెక్ట్ట్రమ్‌ కోసం భారీగా నిధులు వెచ్చించాయి. 5జీ టారిఫ్‌లను ఆయా కంపెనీలు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై రిలయన్స్‌ జియో స్పష్టత ఇచ్చింది. తాము 5జీ ప్లాన్‌ ధరలను పెంచడంలేదని ప్రకటించింది. ఇతర టెలికం కంపెనీలకు పోటీ ఇస్తూ అందుబాటు ధరలో వినియోగదారులకు టెలికం సేవలు అందించడమే తమ లక్ష్యమని జియో తెలిపింది.

- Advertisement -

ప్లాన్‌ ధరలను అనూహ్య స్థాయిలో ఇప్పటల్లో పెంచే ఆలోచన లేదని జియో అధ్యక్షుడు మాథ్యూ ఊమెన్‌ తెలిపారు. దేశంలో ఇంకా 20 కోట్ల మంది 2జీ నెట్‌వర్క్‌పైనే ఆధారపడి ఉన్నారని, వారికి డిజిటల్‌ సేవలు అందించమే జియో లక్ష్యమని ఆయన వివరించారు. అందరూ డేటాను వినియోగించాలన్నదే ముఖేష్‌ అంబానీ లక్ష్యమని ఆయన తెలిపారు. టారిఫ్‌ రేట్లు పెంచితే ఇది సాధ్యంకాదన్నారు.

జియో ఇటీవల వెల్లడించిన త్రైమాసిక ఆర్ధిక ఫలితాలలో యూజర్‌ నుంచి వస్తున్న సగటు ఆదాయం 181.7 రూపాయలుగా ఉందని పేర్కొంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగింది. ఇదే త్రైమాసికంలో ఎయిర్‌ టెల్‌కు ఒక యూజర్‌ నుంచి వస్తున్న సగటు ఆదాయం 200 రూపాయలుగా ఉంది.

వోడాఫోన్‌ ఆదాయం 142 రూపాయలుగా ఉంది. టెలికం కంపెనీల ఆదాయానికి దీన్నే కొలమానంగా తీసుకుంటాయి. ఒక యూజర్‌ నుంచి వస్తున్న సగటు ఆదాయం 300 రూపాయలకు చేరితేనే పరిశ్రమ ఆరోగ్యంగా ఉన్నట్లు అని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విఠల్‌ ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో వోడాఫోన్‌ చాలా వెనుకబడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement