Saturday, April 27, 2024

మరోసారి తగ్గిన బంగారం ధరలు..

మన దేశంలో గ‌త కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఓ రోజు పెరిగితే… ఓ తగ్గుతున్నాయి. ఇక తాజాగా బంగారం ధ‌ర‌ల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 400 తగ్గి రూ. 43,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 430 తగ్గి రూ. 47,130 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 64, 900 వ‌ద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: కుప్పంలో టీడీపీ బోర్లా.. వైసీపీ పాలనకు నిదర్శనం

Advertisement

తాజా వార్తలు

Advertisement