Saturday, April 20, 2024

టోకెన్ల కోసం రోడ్డెక్కిన భక్తులు

తిరుపతి, ప్రభన్యూస్‌: సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులకు నిరాశ ఎదురవడంతో రోడ్డెక్కారు. శ్రీనివాసం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రక్తిత ఏర్పడింది. తిరుపతి శ్రీనివాసంలో వారం రోజులుగా ఇస్తున్న శ్రీవారి సర్వదర్శనం ఉచిత టోకెన్ల ఆఫ్‌లైన్‌ జారీ ప్రక్రియను శుక్రవారం టీ-టీ-డీ అధికార యంత్రాంగం నిలిపివేసింది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని మూడు రోజులుగా టీ-టీ-డీ అధికార యంత్రాంగం మీడియా ద్వారా తెలియజేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో భక్తులకు అవగాహన లేకపోవడంతో శుక్రవారం ఉదయం తిరుపతి శ్రీ నివాసం ప్రాంగణంలోకి వేలాదిగా చేరుకున్నారు. ఆఫ్‌లైన్‌లొ టోకెన్ల జారీ ప్రక్రియ నిలిపివేశారని సమాచారం భద్రతా సిబ్బంది తెలియజేయడంతో ఒక్కసారిగా భక్తుల్లో ఆందోళన వ్యక్తమైంది.
తోపులాట… ఉద్రిక్తత
సర్వదర్శనం టోకెన్లు ఇచ్చి తీరాల్సిందే అంటూ నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది భక్తు లను వెలుపలికి పంపించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తోపులాటలు, వాదోపవాదాలు చోటు-చేసుకోవ డంతో శ్రీనివాస ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేంత వరకు తాము కదిలేది లేదంటూ శ్రీనివాసం ముందు రోడ్డుపై భక్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల రాకపోకల కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న భక్తులను పంపించే ప్రయత్నం చేశారు. ఈ దశలో మళ్లీ తోపులాటలు జరిగాయి. వారందరిని పక్కకు పంపించడంలో పోలీసులు చేసిన ప్రయత్నా లు ఫలించకపోవడంతో కఠినంగా వ్యవహ రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదంటూ భక్తులు టీడీపీ అధికార యంత్రాంగ వ్యవహార తీరు ను వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపించారు. అరుపులు కేకలతో శ్రీనివాసం వద్ద భక్తజనం నిరసన కొనసాగించారు. తమకు ఆఫ్‌ లైన్‌ టోకెన్లు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టు-బట్టడంతో విషయం టీ-టీ-డీ అధికార యంత్రాంగం దృష్టికి చేరింది. శ్రీనివాసం వద్ద నెలకొన్న పరి స్థితులను తెలుసుకొని శుక్రవారం రోజుకు వచ్చిన భక్తులకు మాత్రమే సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రాజకీయం సరికాదు : చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
అక్టోబర్‌ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జియో సంస్థ సబ్‌ డొమైన్‌తో టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయడంపై సామాజిక మాద్యమాల్లో జరిగిన దుష్ప్రచారాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఖండించారు. జియో సంస్థ సేవాభావంతో ముందుకొచ్చిందని, ఈ అంశాన్ని రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. జియో సంస్థ క్లౌడ్‌ పరిజ్ఞానం ద్వారా ఒకటిన్నర గంటల వ్యవధిలోనే సమర్థవం తంగా 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శన టికెట్ల బుకింగ్‌లో ఎదురౌతున్న సాంకేతిక సమస్యలను అధిగ మించేందుకు జియో సంస్థ దాదాపు రూ. 3 కోట్లు విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. భక్తులు, తిరుపతి ప్రజలు, టీటీడీ ఉద్యోగు ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్వ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement