Monday, May 13, 2024

Chicken prices | కొండెక్కిన కోడి కూర ధరలు.. ఒక్క‌సారిగా డ‌బుల్ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కోడి కూర ధర కొండెక్కి కూర్చుంది. నిన్నమొన్నటి వరకు కిలో చికెన్‌ రూ.130కేవచ్చింది. అయితే ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో నిన్నటి వరకు 130 లకే అందుబాటు-లో ఉన్న చికెన్‌ ఇప్పుడు ఒక్కసారిగా డబుల్‌ అయ్యింది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ప్రియులు చికెన్‌ షాపుల ముందు క్యూలు కట్టారు. దీంతో చికెన్‌ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

చికెన్‌ ధర పెరగడంతో మాంసాహార ప్రియులు కేజీ కొనాల్సిన చోట అరకేజీకే పరిమితం అవుతున్నారు. కార్తీక మాసం ముగియడంతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. అంతే కాకుండా క్రిస్టమస్‌, న్యూయర్‌ పండుగలు కూడా ముందు ఉండడంతో చికెన్‌ కు డిమాండ్‌ మరింత పెరగనుంది. నిన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో స్కిన్‌ లెస్‌ చికెన్‌ను కిలో 180 రూపాయలు అమ్మగా.. ఇప్పుడు రూ. 260 రూపాయలకు అమ్ముతున్నారు.

స్కిన్‌ తో నిన్నటి వరకు 130 రూపాయలు పలికిన చికెన్‌ ధర ఒక్కసారిగా రూ. 220 లకి చేరుకుంది. ఒక్కసారిగా 70 నుంచి 80 రూపాయలు పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌ అవుతున్నారు. నాన్‌ వెజ్‌ ప్రియుల డిమాండ్‌ ను దృష్టిలో పెట్టు-కొని రానున్న రోజుల్లో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు- వ్యాపారులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియిడంతో చికెన్‌ షాపులు కొనుగోలదారులతో కిటకిటలాడుతున్నాయి.

బహిరంగమార్కెట్‌లో తగ్గని ఉల్లి ధరలు…

హోల్‌సేల్‌, వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుతున్నా బహిరంగమార్కెట్లలో మాత్రం తగ్గడం లేదు. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి కనిష్ఠ ధర కిలో రూ.5 పలుకుతుండగా బహిరంగ మార్కెట్‌లో రూ.30కే అమ్ముతున్నారు. ఇక తోపుడు బండ్లపై కిలో రూ.30కు, కిరాణా షాపులు, సూపర్‌మార్కెట్లలో రూ.40 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఉల్లి మార్కెట్‌కు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్‌ నుంచి భారీగా సరుకు వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement