Wednesday, May 29, 2024

At 5 PM – పోలింగ్‌కు సిటీ దూరం …తెలంగాణ‌లో 61 శాతం పోలింగ్

మిగిలిన ప్రాంత‌ ఓట‌ర్ల‌లో జోష్
తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా పోలింగ్
హైద‌రాబాద్ మిన‌హా అన్ని చోట్ల 60 శాతానికి పైగా పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. కాగా,, రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్‌ యూనిట్లు, 50,135 వీవీప్యాట్‌లు, 44,906 కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేసారు.. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 625మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ నాలుగు గంట‌ల‌కే ముగిసిది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అలాగే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతున్న‌ది

హైద‌రాబాద్‌లో ఓట‌ర్లు దూరం దూరం

- Advertisement -

ఇక అయిదు గంట‌ల వ‌ర‌కు అందిన స‌మాచారం ప్రకారం పోలింగ్ శాతం వివిధ జిల్లాల‌లో పోలింగ్ స‌ర‌ళి చూసిన‌ట్ల‌యితే ఎప్ప‌టిలానే హైద‌రాబాద్, మ‌ల్కాజీగిరి , సికింద్రాబాద్ ప్ర‌జ‌లు ఓటింగ్ కు దూరంగానే ఉన్నారు..క‌నీసం 40శాతం మంది ఓట‌ర్లు కూడా పోలీంగ్ కేంద్రాల వైపు చూడలేదు.ఇక మిగిలిన 14లోక్ స‌భ స్థానాల‌లో 60 శాతం ఓటింగ్ న‌మోదు కావ‌డం విశేషం..

సాయంత్రం అయిదు గంటల వ‌ర‌కు ఆదిలాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో 69.81 శాతం, నాగ‌ర్‌క‌ర్నూల్ ప‌రిధిలో 66.53 శాతం, జ‌హీరాబాద్ ప‌రిధిలో 71.91 శాతం, భువ‌న‌గిరిలో 72.34, చేవెళ్ల‌లో 53.15 శాతం, హైద‌రాబాద్‌లో 39.17 శాతం, క‌రీంన‌గ‌ర్‌లో 67.67 శాతం, ఖ‌మ్మంలో 70.76 శాతం, మ‌హ‌బూబాబాద్‌లో 61.00, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 68.60 శాతం, మెద‌క్‌లో 71.33 శాతం, మ‌ల్కాజ్‌గిరి ప‌రిధిలో 46.27 శాతం, న‌ల్ల‌గొండ‌లో 70.36 శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, పెద్ద‌ప‌ల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో 42.48, వ‌రంగ‌ల్ ప‌రిధిలో 64.08 శాతం పోలింగ్ న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement