Thursday, May 16, 2024

100 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే దేశంలోని 100 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రతక్ష్య పెట్టుబడులు ఆకర్షించగలమని ప్రభుత్వం పేర్కొంది. ఆర్ధిక సంస్కరణలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మూలంగా ఇది సాధ్యమవుతుందని శనివారం నాడు ఒక ప్రకటనలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 83.6 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఈ పెట్టుబడులు 101 దేశాల నుంచి వచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 రంగాల్లోకి వచ్చాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్లను ఆకర్షించగలమని ధీమా వ్యక్తం చేసింది. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, పారదర్శకత, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుతున్నాయని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టబుడుల కోసం అనేక రంగాలను ప్రభుత్వం సరళీకరించినట్లు తెలిపింది. ప్రధానంగా నిబంధనల్లో మార్పులు, మార్గదర్శకాల్లో ఉదార విధానాలు, నియంత్రణల తొలగింపు వంటి పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ తైమాసికంలో ఎఫ్‌డీఐలు 6 శాతం తగ్గి 16.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
తక్కువ నాణ్యత, హానికరమైన బొమ్మల దిగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. దీని వల్ల వీటి దిగుమతులు 70 శాతం తగ్గి 877.8 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. మన దేశం నుంచి బొమ్మల ఎగుమతతులు 61 శాతం పెరిగి 326 మిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు పేర్కొంది. దేశీయంగా బొమ్మల తయారీకి దిగుమతులపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement