Sunday, May 5, 2024

ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు అలర్ట్‌

ఎస్‌బీఐ యాప్‌ యోనో వినియోగిస్తున్న వారిని బ్యాంక్‌ అలర్ట్‌ చేసింది. పాత అండ్రాయిడ్‌ వాడుతున్న వారు ఓఎస్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. అండ్రాయిడ్‌ ఫోన్లలో ఓఎస్‌ 9 లేదా ఆపై వెర్షన్‌ ఉపయోగించాలని కోరింది. అండ్రాయిల్‌ ఓఎస్‌9లో ఉన్న వెర్షన్లకు గూగుల్‌ సెక్యూరిటీ ఆప్‌డేట్స్‌ను నిలిపివేసిన కారణంగా ఇది ఎంత మాత్రం సురక్షితం కాదని ఎస్‌బీఐ పేర్కొంది.
సెక్యూరిటీ ఆప్‌డేట్స్‌ నిలిపివేసినందున సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి కస్టమర్ల ఖాతాలను టార్గెట్‌ చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎస్‌బీఐ యోనో యాప్‌ నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలతో పాటు, పలు రకాల చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటి సేవలను అందిస్తోంది. బ్యాంకింగ్‌ మోసాలుకు గురి కాకుండా కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

కస్టమర్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఎం-పిన్‌, ఓటీపీ వంటికి ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్‌బీఐ కోరింది. బ్యాంక్‌ ఎన్నడూ కస్టమర్ల వివరాలు ఫోన్‌ ద్వారా అడగడని, ఇలాంటి ఫోన్లు వస్తే, అప్రమత్తంగా ఉండాలని కో రింది. కేవైసీ, పాన్‌ కార్డు అప్‌డేట్‌ పేరుతో వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్‌ చేయవద్దని కూడా కోరింది. మోసపోయినట్లు భావిస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు, సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ తన కస్టమర్లకు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement