Tuesday, July 23, 2024

Delhi High Court – క‌విత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

నేడు ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ
సిబిఐకి నోటీసులు జారీ
త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 24కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు లో నేడు విచారణ జ‌రిగింది.. విచార‌ణ‌లో భాగంగా కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది కోర్టు.. అనంత‌రం విచార‌ణ‌ను ఈ నెల 24కి వాయిదా వేసింది..కాగా, ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మే 10న ఈడీకి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ల విచారణను ఈ నెల 24న చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

- Advertisement -

కాగా ఈ కేసులో మార్చి 15వ తేదిన క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఆ త‌ర్వాత ఇదే కేసులో ఏప్రిల్ 11వ తేదిన సిఐడి ఆమెను అరెస్ట్ చేసింది. అప్ప‌టి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉంటున్నారు క‌విత . ఇక లిక్కర్ పాలసీ ఈడీ,సీబీఐ కేసుల్లో కవిత వేసిన బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు కవిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement