Friday, April 26, 2024

ఎంపీ రఘురామపై ప్రధానికి వైసీసీ నేతల ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ నేతల మధ్య వివాదం తీవ్రం అవుతోంది. ఓవైపు సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రఘురామ ప్రధాని మోదీకి లేఖ రాయగా.. వైసీపీ ఎంపీలు రఘురామపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సోమవారం వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రఘురామకృష్ణరాజు విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రఘురామకృష్ణరాజుకు, టీవీ5 చానల్ చైర్మన్ నాయుడుకు మధ్య రూ.11 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగాయని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. రఘురామను, నాయుడును అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు. దీనిపై ఫెమా కింద కేసు నమోదు చేయాలని, అక్రమ నగదు చెలామణీ చట్టం వర్తింపజేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, తమ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను కూడా వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement