Thursday, April 25, 2024

అశోక్ గజపతిరాజు పిటీషన్‌ వాయిదా

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తన ఆదేశాలను ఈఓ అమలు‌ చేయడం లేదంటూ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పిటీషన్‌పై హైకోర్టులో‌ విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ కేసు విచారణ మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.

కాగా, కొద్దిరోజుల క్రితం.. పెండింగ్​ జీతాలు చెల్లించాలంటూ విజయనగరంలోని మాన్సాస్‌ కార్యాలయం వద్ద ట్రస్టు కళాశాలల ఉద్యోగులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. జీతాలు నిలిపివేయాలని ఈవో వెంకటేశ్వరరావు బ్యాంకుకు లేఖ రాయడంతోనే వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆరోపించారు. 16 నెలలుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్నా..ఈనెల పూర్తిగా నిలిపివేశారని మండిపడ్డారు. అడిగితే నాకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల సమస్యలను ట్రస్టు ఛైర్మన్​ అశోక్​ గజపతిరాజు దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈవో తీరుపై గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement