Friday, April 26, 2024

మెగాఫుడ్‌ పార్క్‌ మామిడి బ్రేక్‌.. ప్రత్యామ్నాయం దిశగా ఏపీఐఐసీ యోచన

కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేసిన మెగాఫుడ్‌ పార్కుకు మామిడి కొరత ఏర్పడింది. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ను ఏర్పాటు- చేశారు. – 57.95 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్‌ పార్కును రూ.112.94 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. సుమారు 7.48 ఎకరాలలో రూ. 86 కోట్లతో మెగా ఫుడ్‌ పార్కు పరిధిలో సీపీసీ(కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌)ని కూడా ఏర్పాటు- చేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలకు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్‌, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారు.

ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లో అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. దీంతో నాగపూర్‌, చెన్నై, హైదరాబాద్‌ మార్కెట్‌లకు మామిడి ఎగుమతి అవుతోంది. ఏప్రిల్‌లో మెగాఫుడ్‌ పార్కును ప్రారంభించాలని ఏపీఐఐసీ నిర్ణయించినప్పటికీ ముడి సరకు(మామిడి) లేక ప్రారంభోత్సవానికి బ్రేక్‌ పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement