Friday, May 3, 2024

మద్యం, మత్తు పదార్థాల నివారణకు అవగాహన

మద్యపానం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీకేష్ లాఠకర్ సూచనల మేరకు ఆర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రెండు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. రెండు వాహనాలలో బృందాలు గ్రామాలు, సంతలలో పర్యటించి మద్యపాన, మత్తు పదార్థాల సేవన నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. మద్యపాన సేవనం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలపై దృష్టి సారించి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ మద్యపానం, మత్తు పదార్థాల సేవనం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని గ్రహించాలని ఆయన సూచించారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నాయని, హానికరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మద్యం తాగడం వలన సులభంగా రోగాల బారిన పడటం జరుగుతుంది ఆయన అన్నారు. మత్తు పదార్థాల తయారీ, రవాణా చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం, మత్తు మందుల వినియోగంపై దృష్టి సారించి వాటి అనర్థాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కష్టజీవులకు నిలయమని అటువంటి జిల్లాలో సామాజిక రుగ్మత ఉండరాదని ఆయన కోరారు. జిల్లా మత్తు పానీయాల రహిత జిల్లాగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని, సరికొత్త సమాజ నిర్మాణం కోసం మార్గదర్శనంగా ఉండాలని ఆయన తెలిపారు.

రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ మద్యం, మత్తుపదార్థాల సేవన వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జిల్లాలో చేపట్టినట్లు చెప్పారు. యువత ఎక్కువగా వీటికి అవుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. మద్యం ఎక్కువ వినియోగంలో ఉన్న  ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను హెచ్చు సంఖ్యలో చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కనీసం ప్రతి మండలంలో కనీసం మూడు, నాలుగు గ్రామాలు శతశాతం మత్తు పదార్థాల రహిత గ్రామాలుగా తయారు చేయుటకు అన్నివిధాల ప్రయత్నిస్తామని అందుకు ప్రజలు, యువత సహకరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement