Monday, September 30, 2024

Big Story: కాశ్మీర్‌ మాజీ సీఎంలకు షాక్.. ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగింపు..

ఫరూక్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌తో సహా జమ్మూ కాశ్మీర్‌లోని నలుగురు మాజీ ముఖ్యమంత్రులు తమ ప్రత్యేక భద్రతా బృందం (ఎస్‌ఎస్‌జి) రక్షణను కోల్పోనున్నారు. ఇందుకు సంబంధించి 2000 సంవత్సరం లో స్థాపించిన ఎలైట్‌ యూనిట్‌ను మూసివేయాలని కేంద్రపాలిత ప్రాంత పారిపాలన నిర్ణయించిందని అధికారులు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (రాష్ట్ర చట్టాల అనుసరణ) ఆర్డర్‌- 2020 మేరకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలొ ఎస్‌ఎస్‌జీ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన 19 నెలల తర్వాత ఈ పరిణామం తెరపైకి వచ్చింది. కాశ్మీర్‌ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు, వారి కుటుంబాలకు ఎస్‌ఎస్‌జీ భద్రత కల్పించే నిబంధనను తొలగించాలని నిర్ణయించింది.

జమ్మూ కాశ్మీర్‌లో ముఖ్యమైన నేతలకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని పర్యవేక్షించే సెక్యూరిటీ రివ్యూ కోఆర్డినేషన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారులు తెలిపా రు. తద్వారా వారి భద్రతకు సంబంధించిన అంశాలను ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంతకంటే ఎక్కువ ర్యాంక్‌ ఉన్న డైరెక్టర్‌కు బదులుగా సూపరింటెం డెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారి దీనికి నాయకత్వం వ్యవహస్తారు. ఏది ఏమైనప్పటికీ, ఎస్‌ఎస్‌జిని తగ్గించడంపై పునరాలోచన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు, ఇది ఎలైట్‌ యూనిట్‌ యొక్క సంసిద్ధత కు ఆటంకం కలిగిస్తుందని పోలీసు శాఖలోని కొంతమంది నిపుణులు భావిస్తు న్నారు. ఇకపై ఎస్‌ఎస్‌జీ భద్రతను సిట్టింగ్‌ సీఎంకు, వారి కుటుంబ సభ్యులకు పరిమితం చేయనున్నారు.

శ్రీనగర్‌లో అనేక ఉగ్రవాద సంఘటనలు చోటుచేసుకున్న సమయంలో ఫరూక్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు భద్రతను ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకోనుండం విమర్శలకు దారి తీస్తోంది. వీరిలో కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ మినహా మిగతావారంతా శ్రీనగర్‌ లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆజాద్‌లకు నేషనల్‌ సెక్యూరి టీ గార్డ్‌ సేవలు కొనసాగుతాయి. ప్రస్తుతం వీరు జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నందున బ్లాక్‌ క్యాట్‌ కమాండోల రక్షణవలయం ఉంటుంది. ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీకి జమ్మూ-కాశ్మీర్‌లో ఉన్నప్పుడ్గు జడ్‌ ప్లస్‌ భద్రతను కొనసాగి స్తారు. కేంద్రపాలిత ప్రాంతం వెలుపల భద్రతను తగ్గించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement