Monday, April 29, 2024

‘పుష్ప’ హ‌క్కులు భారీ ధ‌ర‌కి కొనుగోలు చేసిన ‘అమెజాన్ ప్రైమ్’

అమెజాన్ ప్రైమ్ లో పుష్ప చిత్రం రేప‌టి నుంచి జ‌న‌వ‌రి 7నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ విష‌యాన్ని అమెజాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. కాగా ఈ సినిమా హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింద‌ని స‌మాచారం. రూ.27 కోట్ల నుంచి రూ.30 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. నాలుగు భాషల్లో అభిమానుల కోసం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో సినిమా అందుబాటులోకి రానుంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న దేశ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ చిత్రం. కాగా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతూ మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోందీ చిత్రం. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement