Sunday, December 3, 2023

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ మహాసంప్రోక్షణలో విశేష హోమాలు

తిరుపతి సిటీ, మే 23 (ప్రభ న్యూస్): స్థానిక గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విశేష హోమాలు నిర్వ‌హించారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత ఉక్త హోమాలు, పంచసూక్త హోమాలు జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
   

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ రవికుమార్, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement