Saturday, April 27, 2024

ఘనంగా ప్రపంచ నీటి నిల్వ దినోత్సవం


ఉలవపాడు : నీటి నిల్వ తగ్గి వాడకం పెరిగిందని దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఇఓఆర్డీ చెంచులక్ష్మి తెలిపారు. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రపంచ నీటి నిల్వ దినోత్సవం సందర్భంగా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటి నిల్వ తగ్గిందని, మన వాడకం పెరిగిందని, ఇప్పుడు బబుల్‌ నీరు రూ.10 లకు కొంటున్నామని భవిష్యత్తులో దీనిని మనం రూ.50 నుంచి రూ.100ల వరకు కొనుక్కునే ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. వర్షపు నీరు నిల్వ చేయడానికి నీటి కుంటలు తమ ఇళ్ళవద్దనే ఏర్పాటుచేసుకుంటే ఆ వర్షపు నీరు వాటిలోనే ఉండి భూమికిలోకి ఇంకుతాయని దీంతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఆమె సూచించారు. ఈ సందర్బంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉలవపాడు మండలంలో ర్యాలీలు కూడా నిర్వహించారు. అనంతరం ఏపిఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నీటి ఆవశ్యకత గురించి కూడా ఆయన తెలియజేశారు. మండలంలోని అన్నీ గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జలశక్తి అభియాన్‌ గురించి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌కు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు గ్రామ పంచాయితీ కార్యనిర్వహణాధికారిణి విజయమ్మ, సర్పంచ్‌ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement