Tuesday, May 7, 2024

ప్రపంచ జల దినోత్సవం

వలేటివారిపాలెం : నీటిని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని స్థానిక ఎంపిడిఓ రఫీక్‌ అహ్మద్‌ తెలిపారు. మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం నుండి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయం నుండి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్‌లో ఎంపిడిఓ మాట్లాడుతూ నీటిని ప్రతి ఒక్కరూ సంరక్షణ చేయాలని ఆయన అందరితో ప్రతిజ్ఞచేయించారు. ప్రతి ఒక్కరు నీటి విలువ తెలుసుకుని అవసరమైన మేరకే ఉపయోగించి నీటి పొదుపు చేయాలన్నారు. నీటిని పొదుపు చేయడం వల్ల రాబోయే తరాలకు నీటి వనరులను అందించిన వారమవుతామని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి వారు 1993 సంవత్సరంలో మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటిం చారని ఆయన తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నీటిని వృద్ధా చేయకుండా పొదుపు చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఎం ధనుంజయరావు, ఏడి బ్ర హ్మయ్య, వైస్‌ సర్పంచ్‌ కిష్టయ్య మరియు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement