Monday, April 12, 2021

పలుగు పట్టిన క‌లెక్టర్ గంథం…కూలీల‌తో శ్ర‌మైక జీవ‌నం..

అనంత‌పురం – ఆయ‌నో జిల్లాకు క‌లెక్ట‌ర్… శ్ర‌మైక జీవ‌నం గురించి పూర్తిగా తెలిసిన వ్య‌క్తి… ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం త‌పించే గుణం… అందుకే అనంత‌పురం క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేపట్టిన కొన్ని నెల‌ల‌ల్లోనే సామాన్యుల నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు మ‌న‌స్సులు దోచుకున్నారు.. ఆయ‌నే గంథం చంద్రుడు… క‌లెక్ట‌ర్ గా, జిల్లా మెజిస్ట్రేట్ గా స‌మ‌ర్ధవంతంగా విధులు నిర్వ‌హిస్తున్న ఆయ‌న నేడు జిల్లాలో జ‌రుగుతున్న ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించారు.. కూలీల‌తో ఆయ‌న మేమేక‌మ‌య్యారు.. వారితో క‌లిసి పలుగు, పారా అందుకున్నారు.. కూలీలాగే ప‌నుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.. క‌లెక్ట‌ర్ అంత‌టి వాడు త‌మతో పాటు ప‌ని చేయ‌డం కూలీలు అబ్బుర‌ప‌డ్డారు.. అత‌నితో పాటు క‌థం తొక్కారు..పనుల‌ను చ‌క‌చ‌కా చేశారు.. కాస్త విశ్రాంతి తీసుకున్న క‌లెక్ట‌ర్ కూలీల‌తో ముచ్చ‌టించారు..ప‌ని వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు.. కూలీ డ‌బ్బులు వ‌స్తున్నాయా అంటూ ప్ర‌శ్నించారు.. ఇదే సంద‌ర్భంగా వేస‌వి కాలంలో ప‌ని చేయాల్సి ఉన్నందున ఉపాథి హామీ కూలీల‌కు మ‌జ్జిగ స‌ర‌ఫ‌రా చేయ‌వ‌ల‌సిందిగా డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డిని క‌లెక్టర్ అదేశించారు. త‌మ గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్న క‌లెక్ట‌ర్ మ‌న‌సున్న మారాజు అంటూ కూలీలు కృత‌జ్ఞ‌తభావంతో న‌మ‌స్క‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Prabha News