Tuesday, May 14, 2024

చిత్తూరు జిల్లాలో మళ్లీ వింత శబ్దాలు.. ఇళ్లలో నుంచి పరుగు పెట్టిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో వరుసగా భూప్రకంపనలు సంభవింస్తున్నాయి. గత రెండు వారాలుగా కొన్ని ప్రాంతాల్లో వరుసగా వింత శబ్దాలు, ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రామకుప్పం మండలంలోని గెరిగి పల్లె, పెద్దగరికపల్లి, గొరివిమాకులపల్లి, గడ్డూరు తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ప్రజలు ఇళ్లు వదిలి పంట పొలాల్లోకి పరుగులు తీశారు. రాత్రి నుంచి వింత శబ్ధాలతో రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  

ఇటీవల చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు, వరదలు వణికించిన సంగతి తెలిసిందే. వరద ముప్పు నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే.. ఇలా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటుండటంతో ఆందోళన చెందుతున్నారు. గత వారం కూడా రామకుప్పం, సోమల మండలాల్లో కూడా భూమి కంపించింది. ప్రకంపనలకు భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్ల గోడలు బీటలు వారినట్లు స్థానికులు తెలిపారు. భూప్రకంపల ధాటికి ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement