Saturday, April 27, 2024

తాటిపాక వేద కళాశాలలో వాచ్ మెన్ హత్య


కోనసీమ జిల్లా, రాజోలు మండలం తాటిపాక వేద జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న నైట్ వాచ్ మెన్ కొల్లాబత్తుల సుబ్బారావు (65)ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంచంపై పడుకుని ఉన్న అతని తలపై రాడ్లతో కొట్టి చంపారు. కాలేజీ మెయిన్ ఆఫీస్ షట్టర్ బద్దలు కొట్టి వస్తువులన్నీ చిందర వందరగా పడవేశారు. సంఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి పరిశీలించారు. క్లూస్ర్ టీమ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. ఈ ఘటనపై రాజోలు సిఐ శేఖర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement