Saturday, April 27, 2024

డ్రగ్స్ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు.. అనంతపురం రేంజ్ డీఐజీ సీరియ‌స్‌

అనంతపురం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాపిక్ సబ్ స్టెన్సెస్ (ఎన్ డీ పీ ఎస్) కేసుల్లో లోతుగా పరిశోధించి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాశ్ రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన సి ఐ ఆపై స్థాయి ఆధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఈ సందర్బంగా రవి ప్రకాశ్ మాట్లాడుతూ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలే కాదు ఎక్కడి నుండీ సరుకు వచ్చింది, సరుకు ఎక్కడికి వెళ్తోంది, విక్రయదారులు, దుకాణందారులు ఎవరు, వినియోగదారులు ఎవరు అనే కోణాల్లో స్పష్టంగా తేల్చాల‌న్నారు.

ఇక‌.. సరుకు పంపిన, అక్రమ రవాణా మొదలు చివరిగా చేరే వరకు లింకులో ఉన్న అందర్నీ అరెస్టు చేయాలని ఎవర్నీ వ‌దిలిపెట్టొద్ద‌ని డీఐజీ సీరియ‌స్‌గా చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అన్న సంకల్పం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి, డీజీపీ డ్రగ్స్ రహితంపై ప్రధాన దృష్టి సారించారన్నారు. ఆ దిశగా అందరం సంఘటితంగా పని చేయాలన్నారు. ముఖ్య పట్టణాలలో మత్తు పదార్థాల అనర్థాలపై హోర్డింగ్స్ పెట్టాలి. అదేవిధంగా కళాశాలలకు వెళ్లి మత్తు పదార్థాలు, అనర్థాలపై కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన చేయాలన్నారు.

ఈనెల 15 వరకు నమోదైన ఫోక్సో కేసుల్లో ఈనెల ఆఖరులోగా తప్పనిసరిగా సి.సి నంబర్లు తెచ్చుకోవాలి. సి.సి నంబర్లు లేని ఫోక్సో యు.ఐ కేసులు కనపడకూడదన్నారు. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ( ఎన్ డీ పీ ఎల్ ) కూడా కట్టడికి చర్యలు తీసుకోవాలి. కర్నాటక తమిళనాడు సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా వేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలి. 41 సీఆర్ పీసీ కింద నోటీసుల జారీ విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించి రేంజ్ కు ముఖ్యంగా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement