Saturday, April 27, 2024

సచివాలయ పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం

బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంపాయన పల్లి పంచాయతీ నందు గల గ్రామ సచివాలయం నందు గురువారంజిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పూతలపట్టు. ఎం. ఎల్. ఎ. ఎం. ఎస్.బాబు కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని 45 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవరు భయపడవద్దని వేసుకుంటే ఏమి జరగదని కనుక ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్ నందు చికిత్స కోసం ఎన్ని ఇబ్బందులు పడతాడు మీకు తెలియదని కావున ప్రతి ఒక్కరు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు ఎం, పి.డి.ఓ. విద్యా రమ మాట్లాడుతూ బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో గల కమిటీ హాల్ ను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే వారికోసం ప్రభుత్వ వైద్య అధికారులకు కేటాయించడం జరిగినది అని కనుక మండలంలో గల ప్రతి ఒక్కరు స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణములో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లోహిత్ చెంగల రాయలు.మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి. శిరీష్ రెడ్డి. శరత్ రెడ్డి.ప్రవీణ్ రెడ్డి. ప్రభు నాయుడు.ఎంపీటీసీలు, హేమ చంద్ర. చాన్ భాషా. సర్పంచ్ మహేంద్ర రెడ్డి. కేశవ రెడ్డి. సీతారాం రెడ్డి.తుంబ కుప్పం యువజన నాయకులు మంజునాథ్. పూతలపట్టు నియోజకవర్గ సేవ జిల్లా అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి. వైకాపా నాయకులు కొత్తపల్లి మహేంద్ర. నాగరాజ. ఏఎన్ఎంలు. ఆశా వర్కర్లు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement