Tuesday, April 30, 2024

AP | వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం: పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలన్నారు. యువత తలుచుకుంటే ఆ పని ఈజీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తరపున చంద్రబాబుతో కలిసి రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలన్నారు. యువత తలుచుకుంటే ఆ పని ఈజీ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని మంత్రి పెద్దిరెడ్డి పెంచి పోషించారని పవన్ వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిని ఎదుర్కొనే బలం యువతకు లేదా అని ప్రశ్నించారు. డ్యాములు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పట్టించుకోరని మండిపడ్డారు. మద్యం వ్యాపారాలు చేసుకుంటూ…. సంపదంతా వారి కుటుంబాల పేరుపై దాచుకుంటున్నారని ఆరోపించారు.

రాజంపేటకు పరిశ్రమలు రావాల్సి అవసరం ఉందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. యువత‌కు ఉపాధి కావాలంటే కూటమికి ఓటు వేయాలన్నారు. సోమశిల బ్యాక్ వాటర్స్ ప్రాంతాన్ని పర్యాటకం పరంగా డెవలప్‌మెంట్ చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఒంటిమిట్లను టెంపుల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కోస్తా ఏరియాలో వైసీపీకి ఒక్క సీటు సైతం రాదని, రాయలసీమలోనూ ఆ పార్టీని తుడిచిపెట్టేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement