Friday, May 17, 2024

Review Meeting – మెద‌క్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది.. దీపాదాస్ మున్షి

మెదక్ పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. మంగళవారం చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ సెక్రెటరీ,మెదక్ పార్లమెంటు ఇంచార్జ్ విశ్వనాద్ తో కలిసి దీపాదాస్ మున్షి ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా దీపదాస్ మున్షి ఎన్నికల వేళ స్టాటజీ ఎలా ఉండాలన్న దానిపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు కొద్దిరోజులే గడువు ఉందని, ఈ పది రోజులు శ్రమించాలని సూచించారు. అలాగే కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో పటాన్ చెరు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ ఇన్చార్జి తూముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, సిద్ధిపేట ఇంచార్జి ఇన్చార్జి పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ అభ్యర్థికి బుద్ధి చెప్పాలి

కొండాపూర్ నుంచి రోడ్ షో..

భూములు లాక్కొని, పేదలకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దుర్మార్గుడికి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ నుండి తొగరపల్లి శివాజీ సెంటర్ వరకు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రసంగిస్తున్న చోటుకి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచార వాహనం చేరుకుంది. దీంతో నీలం మధు ఆయా ప్రచార వాహనాన్ని చూపిస్తూ.. కలెక్టర్ గా ఉన్న సమయంలో వెంకట్రాంరెడ్డి రైతులకు చేసిన అన్యాయాలను వివరించారు. ఇలాంటి దుర్మార్గుడికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చిందని, ఇలాంటి వ్యక్తికి ఓటు ఎలా వేస్తారో? ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇకపోతే గత పాలకులు యువతకు ఉద్యోగాల పేరిట మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో యువత ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఏన్ఎస్ యుఐ శివారెడ్డి, ఎంపీపీ మనోజ్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రభు, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, సుమ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement