Wednesday, October 16, 2024

Kuppam – జ‌గ‌న్ ది అంతా క‌బ్జా పాల‌నే – భువనేశ్వరి

భూమి క‌నిపిస్తే మింగేయ‌డ‌మే
వ‌క్ఫ్, ఆల‌య భూముల‌ను వ‌ద‌ల‌ని సిఎం
ప్ర‌భుత్వ ఆస్తుల‌ను సైతం త‌న‌ఖా పెట్టిన ఘ‌నుడు
ఈ ఎన్నిక‌ల‌లో అత‌డిని ఓడించాల్సిందే
ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చిన నారా భువ‌నేశ్వ‌రి

కుప్పం: ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలనూ వైకాపా వదల్లేదని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడుతూ, 80 శాతం వక్ఫ్‌ భూములను వైకాపా ఆక్రమించుకుంద‌న్నారు. . భూములు కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంద‌ని అన్నారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలేవీ జగన్‌ నెరవేర్చలేద‌ని ఆరోపించారు. . సచివాలయంతో పాటు అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బు లాగుతున్నాంటూ మండిప‌డ్డారు. ఇక పార్టీకి అండ‌గా ఉన్న టిడిపి కార్యకర్తలను బెదిరించార‌ని, .. చాలా మందిని వేధించార‌ని, . అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టార‌ని భువ‌నేశ్వ‌రి అన్నారు. . ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా మైనారిటీలకు 50 నుంచి 100 యూనిట్లకు పెంచింది టిడిపినేన‌ని, . విభజన తర్వాత ఏపీ అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఐదేళ్లు కష్టపడ్డారన్నారు.

- Advertisement -

కుప్పంలో చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు

మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా కుప్పం నియోజకవర్గం పెద్ద ఎత్తున వాడ వాడల సంబరాలు చేసుకొన్నారు. దీనిలో భాగంగా భువనేశ్వరి రెండవ వార్డులో వెలసియున్న కదిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయలంలో నారా చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామగుట్టపల్లి గ్రామస్తులు సూపర్ సిక్స్ పథకాలను ప్రతిబింబిస్తూ వినూత్నంగా ఏర్పాటు చేసిన 74కేజిల భారీ కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సామగుట్టపల్లి గ్రామస్తులు, ఎమ్మెల్సీ శ్రీకాంత్,కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement