Saturday, April 27, 2024

తిరుప‌తి ప్ర‌చారంలో ప్రతి ఇంటిని చుట్టేద్దాం…

ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల సరికొత్త వ్యూహం
ప్రతి 40 కుటుంబాలు… ఓ క్లస్టర్‌గా విభజన
ప్రతి ఇంటికి పదిసార్లు… టీడీపీ వ్యూహం
ప్రతి వార్డులో ప్రచారం నిర్వహించేలా వైసీపీ ప్లాన్‌
పవన్‌కల్యాణ్‌ రాకతో బీజేపీలో పెరిగిన ఉత్సాహం
నిన్న పవన్‌.. నేడు లోకేష్‌, రేపు బండి సంజయ్
తిరుపతిలో పోటాపోటీగా ప్రచారాలు
ఉప ఎన్నికలపై ఎవరి ధీమా వారిదే

తిరుపతి పార్లమెంట్‌కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహంతో ప్రచారానికి పదును పెడుతున్నాయి. పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి ఇంటికీ పదిసార్లు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకుంది. అధికార వైసీపీ స్థానిక నేతలతో కలిసి గడపగడపకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ కూడా ప్రచారంలో వేగాన్ని పెంచాలని అందుకోసం సరికొత్త ఎత్తుగడను వేస్తోంది. ప్రత్యేకించి పవన్‌కళ్యాణ్‌ రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నా యి. అధికార వైసీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తి బరిలో ఉన్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ పోటీలో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మరికొన్ని పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ, బీజేపీల మధ్యే పోటీ సాగనుంది. ఎవరికి వారే ఉప ఎన్నికలను ఓ సవాల్‌గా తీసుకున్నారు. వైసీపీ 2019లో వచ్చిన మెజార్టీ కంటే అధికంగా మరో 2 లక్షల మెజార్టీని సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. టీడీపీ ఎలాగైనా గెలుపొంది తమ సత్తా చాటుకోవాలని, ఆ దిశగా ఆ పార్టీ అధిష్టానం బలమైన నాయకులను ప్రచారం లోకి దించింది. బీజేపీ కూడా ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ, టీడీపీలపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్రంపై పట్టుసాధించాలని కమలనాధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నా రు. అందుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి సహకారం అందిస్తుండడంతో పాటు గత రెండు రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన రోడ్‌ షో బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో అదే ఉత్సాహంతో బీజేపీ పార్లమెంట్‌ పరిధి లోని అన్నీ అసెంబ్లిd నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌ కూడా ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేం దుకు రాబోతున్నారు. అలాగే 10వ తేదీ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా తిరుపతికి రాబోతున్నారు. ఇలా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ నాయకులతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా రంగంలోకి దిగారు. మరోవైపు టీడీపీ కూడా సీనియర్‌ నేతలను ప్రచార పర్వంలోకి దించింది. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఇప్పటికే తిరుపతికి చేరుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన పార్లమెంట్‌ పరిధిలోనే పర్యటించనున్నారు. వైసీపీ నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో మంత్రి, ఇద్దరు శాసనసభ్యులు నిత్యం సభలు, రోడ్‌ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ప్రతి 40 కుటుంబాలు.. ఓ క్లస్ట ర్‌గా విభజన
తెలుగుదేశం ఉప ఎన్నికలను సవాల్‌గా స్వీకరించింది. ఎలాగైనా తిరుపతి పార్లమెంట్‌పై విజయం సాధించి రాష్ట్రంలో తన బలాన్ని చాటుకోవాలని యోచి స్తోంది. అందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి 40 కుటుంబాలను ఓ క్లస్ట ర్‌గా విభజించింది. ఆ 40 కుటుంబాల పరిధిలో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యత క్లస్ట ర్‌ ఏజెంట్‌కు కట్టబెట్టారు. ఆ దిశగా పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లిd నియోజకవర్గాలకు సంబంధించి మండలాల వారీగా, గ్రామాల వారీగా క్లస్ట ర్లను ఏర్పాటు చేశారు. వారితో టీడీపీ సీనియర్‌ నేతలు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. వారి ఆధ్వర్యంలోనే ప్రచారాన్ని కూడా చేపడుతున్నా రు. ఆ పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆయా ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో క్లస్ట ర్‌ ఏజెంట్లే వారి పరిధిలో ప్రచారా లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
గడపగడపకు వైసీపీ
తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి గడపకు వీలైనన్ని ఎక్కువసార్లు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించాలని వైసీపీ ఆ దిశగా ప్రణాళికలు రూపొందించింది. ప్రతి 50 కుటుంబాలను కలిసి కరప త్రాలు అందజేయడం, అదే విధంగా రాష్ట్రంలో వైసీపీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించడం వం టి ప్రత్యేక ప్రణాళికలతో వైసీపీ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లిd నియోజకవర్గాలకు 7 మంది మంత్రులను, ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు శాసనసభ్యులను నియమించి ప్రచార బాధ్యతలను పూర్తిగా వారికే అప్పగించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో భారీ మెజార్టీ తీసుకొచ్చిన మంత్రులకు ర్యాంకులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో తిష్ట వేసి గడిచిన వారం పదిరోజులుగా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement