Friday, April 26, 2024

11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ చదివే అవకాశం.. తెలుగులోను..

ఇక పై ఇంజనీరింగ్ విద్యను కూడా తెలుగులో చదివేయవచ్చు..అవును ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ బోధనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తెలిపారు. బీటెక్ కోర్సులను ఇక పై ప్రాంతీయ భాషలైన తెలుగు సహా హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాళీ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో అనుమతించనున్నారు. ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు మోదీ కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ట్విట్టర్ లో హమాలి జాబ్ కోసం అప్లికేషన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement