Friday, April 19, 2024

ట్విట్టర్ లో హమాలి జాబ్ కోసం అప్లికేషన్..

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతుంటే.. హమాలీ పని చేసుకోవాలన్నట్లు మంత్రి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చే్స్తున్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటరిస్తు ట్విట్టర్ లో ఐ వాంట్ హమాలీ జాబ్ అంటూ తమ సర్టిఫికెట్లు తో ఫోస్టులు పెడుతున్నారు..స్వరాష్ట్రం కోసం రబ్బరు బుల్లెట్లు, పోలీసు లాఠీ దెబ్బలకు సైతం తట్టుకొని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనూ నిరుద్యోగులకు అవమానమే ఎదురవుతోందని చివరికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హమాలి ఉద్యోగానికి నేరుగా దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఐ వాంట్ హమాలి జాబ్” అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనలు చేయడం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన కుదరడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. .

ఇది కూడా చదవండి; ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు: స్పీకర్ తమ్మినేని..

Advertisement

తాజా వార్తలు

Advertisement