Thursday, August 5, 2021

శేరిలింగంపల్లిలో అగ్నిప్రమాదం.. రెండు కార్లు దగ్ధం

హైదరాబాద్‌ శివారులోని శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. నల్లగండ్ల వద్ద ఉన్న కారు షెడ్డులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్‌లో ఉన్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఫోన్ మాట్లాడుతూ జారిపడి యువకుడు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News