Friday, November 15, 2024

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..

యల్లనూరు : సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో వెంకయ్య కాలువ రోడ్డు సమీపంలో ఉన్న బోయ సామాజిక వర్గానికి చెందిన గజ్జప్ప గారి బాలరాజు, దాసప్పాగారి నరసింహలు రెండు కుటుంబాల మధ్య బుధవారం ఒక అమ్మాయి వివాహ సంబంధం కారణంతో రాళ్ల తో దాడీ చేసుకున్నారు. ఇందులో పరస్పర దాడుల్లో చాపల పెద్దయ్య, వెంకటనారాయణ, నరసింహలు ముగ్గురికి గాయాలు అయ్యాయి. జరిగిన సంఘటన పై ఇరు వర్గాలకు చెందిన 10మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై విచారణ జరపాలని ముద్దాయిలను పోలిస్ స్టేషన్ కు రమ్మని పోలీసులు కబురు పెట్టడంతో దాసప్పగారి నరసింహులు వర్గం స్టేషన్ కు వస్తున్న సందర్భంలో చాపల పెద్దయ్యను తీవ్ర గాయపరచరన్న నెపంతో పెద్దయ్య వర్గానికి చెందిన వ్యక్తులు దారిలో కర్రలతో దాడి చేయగా కుక్కల చంద్రకు తలపై తీవ్ర గాయం అయింది. నాగమునికి చేయి విరిగింది. సంఘటన పై తాడిపత్రి రూరల్ సీఐ వేణుగోపాల్ మండల కేంద్రంలో కర్యూ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement