Tuesday, May 28, 2024

AP: పులివ‌ర్తి నానిపై దాడి.. అరుగురు అరెస్ట్

తిరుపతి: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్‌రెడ్డి, నడవలూరు సర్పంచ్‌ గణపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇక నానిపై దాడిలో సుమారు 15మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను గంటలో అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్ర‌స్తుతం నానీ తిరుప‌తి టిమ్స్ లో చికిత్స పొందుతున్నారు… మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పులివర్తి నాని భార్య సుధ ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా.. నిందితులను పట్టుకోలేదంటూ తిరుచానూరు పీఎస్‌ వద్ద ఆమె నిరసన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement