Tuesday, May 28, 2024

AP: ఎమ్మెల్యే కేతిరెడ్డి, జేసీల ఇంటి వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు

ఇద్ద‌రిని వేర్వేరు ప్రాంతాల‌కు త‌ర‌లింపు
ఆయా ప్రాంతాల నుంచి వైసీపీ, టీడీపీ కార్య‌కర్త‌లు త‌రిమివేత
ప‌ట్ట‌ణంలో 144 సెక్ష‌న్ అమ‌లు..
హ‌ద్దుమీరితే క‌ఠిన చ‌ర్య‌లు అంటూ డీఎస్పీ హెచ్చరిక

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు.

లాఠీఛార్జిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడు కిరణ్‌కుమార్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఈ లాఠీఛార్జి జరగడం గమనార్హం. ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా పోలీసులు దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్‌ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హ‌ద్దు మీరితే క‌ఠిన చర్య‌లు తీసుకుంటామంటూ డీఎస్పీ హెచ్చ‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement