Thursday, May 16, 2024

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలీ ..తన కుమారై పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్ అంటోన్న నటుడు

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా స్టార్ కమెడియన్..వైసీపీ నేత అలీ నియమితులయ్యారు.
ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు జారీ చేశారు. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీత భత్యాలు అందనున్నాయి. మరోవైపు తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించడంపై అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా అలీ స్పందిస్తూ.. ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని అన్నారు. వైసీపీలో చేరిన తొలిరోజు నుంచే తాను పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. పార్టీలో పదవులను తాను ఏనాడూ ఆశించలేదని చెప్పారు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్దతతో పూర్తి చేశానని… తన సేవలను జగన్ గుర్తించారని చెప్పారు. తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement