Saturday, April 27, 2024

656పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ – భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

రెండో రోజు స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా న‌ష్టాల‌తో ముగిశాయి. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కోవ‌డం మార్కెట్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపింది. దాంతో నేడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి పడిపోయింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి దిగజారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.83%), టాటా స్టీల్ (1.19%), మారుతి సుజుకి (1.17%), యాక్సిస్ బ్యాంక్ (0.55%), టెక్ మహీంద్రా (0.51%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచాయి. ఇన్ఫోసిస్ (-2.77%), ఏసియన్ పెయింట్స్ (-2.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%), నెస్లే ఇండియా (-2.41%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement