Monday, April 29, 2024

ఉపఎన్నికల్లో చింతా గెలుపుకోసం శ్రమిస్తాం

సత్యవేడు, ప్రజా వ్యతిరేక పాలన కారణంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని సత్యవేడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పెనుబాల చంద్రశేఖర్ విమర్శించారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,కార్యకర్తలు ,పార్టీ అభిమానులతో కలిసి తిరుపతి ఉపఎన్నికపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎండగడుతామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో చింతా మోహన్ ను అఖండ మెజార్టీ తో గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా ఛాటుతామన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గాడి తప్పడం వల్లనే ధరల స్థిరీకరణలో విఫలం అయ్యారని ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరల కారణం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనీ ప్రజా వ్యతిరేఖ విధానాలను విమర్శించారు. విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని విశాఖ ఉక్కు ఢిల్లీ ఇష్టం అనేలా మార్చి అమ్మేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలు , ప్రైవేటీకరణ ధనవంతులను అభివృద్ధి చేసే విధంగా ఉందే కానీ దేశంలోని రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చేలా లేవని వివరించారు. ప్రజల్లో అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేఖత , ప్రజల క్షేమానికి కాంగ్రెస్ చేసిన సేవలే తమ గెలుపుకు శ్రీకారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సత్యవేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యులు రాజీవ్ , నాయకులు రామచంద్రా రెడ్డి ,సరోజినమ్మ ,రవినాయుడు ,సాయి ,పురుషోత్తం ,చేతన్ కుమార్ మాణిక్యం ,వినోద్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement