Monday, May 6, 2024

సర్వకార్య సిద్ధి వ్రతం సంకటహర చతుర్థి

వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా||

హందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. హందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుడిని పూజిస్తాం. అయితే మనుషుల కష్టాల నుంచి గట్టె క్కించడానికి చేసే వ్రతం సంకటహర చతుర్థి. గణశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి. ఈ చవితి పూజను రెండు రకాలుగా ఆచ రిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్ధి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతు ర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటా రు. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెల లపాటు ఆచరించాలి. ఈ సంకటహర చతుర్థి ప్రతినెల కృష్ణ పక్షం అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి తిథి నాడు వస్తుంది.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావ డం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకట#హర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకము లోని కుజదోష సమస్యలు తొలగడంతోపాటుగా, చేసే పను లలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.
ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టు లకు, సర్వగణాలకు అధిదేవతని, సర్వులకు జ్యేష్టుడని, అధి నాయకుడని, కీర్తించబడ్డాడు. గణపత్యథర్వ శీర్షిపనిషత్తు లో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని, ఆనందమయుడని, లంబోదరుడని, అభివ ర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసే వాడని సంకట హరుడుగా కూడా పూజించడం అనాదిగా వస్తున్నదే.
సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మరాజుకు వివరించినట్లు పురాణ కథనం. భవిష్య, నరసింహ పురాణా ల ప్రకారం, ఒకసారి ఇంద్రుడు, గణశ ఉపాసకుడైన భృషుండి అనే మహాముని ఆశ్రమం నుండి, విమానంపై ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ, శూరసేన మహారాజు రాజ్యం మీదు గా వెళ్ళే సమయాన మహాపాపాత్ముడొకడు, విమానాన్ని చూసి నంతనే విమానం నేలపై దిగిపోతుంది. తేజోవిరాజితమైన విమానా న్ని శూరసేనుడు చూడబోయి, ఇంద్రుడిదని తెలుసుకుని, ఆగిపోవ డానికి కారణమడిగి ఇంద్రుని ద్వారా విని, మళ్ళీ లేచే ఉపాయం ఏదని అడుగుతాడు. ఆనాడు బహుళ పంచమి అయినందున, గత దినం చతుర్థినాడు ఉపవసించిన భక్తులు ఉపవాస ఫలాన్ని ధార బోస్తేనే, విమానం మళ్ళీ లేవగలదని ఇంద్రుడు వివరిస్తాడు. శూర సేనుని ఆజ్ఞాను వర్తులైన సైనికులు రాజ్యమంతా వడబోసినా అట్టి భక్తులు దొరకని స్థితిలో నిరాశకు లోను కాగా, ఆ సమయంలోనే మృతి చెందిన ఒక స్త్రీని గణపతి దూత తీసుకెళుతుండడం చూసి ఇదేమిటని సైనికులు అడుగుతారు. ఆమె గత దినం నిద్రలో ఉపవా సంతో ఉండి, రాత్రి చాలా సమయం గడిచిన తర్వాత మెలకువ వచ్చి భోజనం చేసిందని, తెల్లవారి మృతి చెందినదని, అలాగే జీవితంలో ఒకసారైనా సంకట#హర చతుర్థి ఆచరిస్తే గణపతి లోకప్రాప్తి లభించ గలదని చెప్పారు. ఆమె శరీరాన్ని తమకు ఇవ్వాలని సైనికులు కోర గా, గణపతి దూత నిరాకరిస్తాడు. అదే సమయంలో ఆమె శరీరం నుండి వీచిన పెనుగాలి ఇంద్రుని విమానాన్ని స్పృశించిన వెంటనే అది పైకి లేస్తుంది. సంకట#హర చతుర్థి రోజు ఉపవాసం చేయడం అంత పుణ్యఫలం అని చెబుతారు పండితులు.
ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇదే రోజున సంధ్యా సమయం ముగిశాక చం ద్రుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఉపవాసం ఉండేవారం తా చంద్రుడిని చూసిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమించాలి.
ఈరోజున ఖచ్చితంగా చంద్రుడిని ఎందుకు దర్శించుకోవాలి అంటే! హందూ పురాణాల ప్రకారం, వినాయక చతుర్థి లేదా చవితి రోజున చంద్రుడిని దర్శనం చేసుకోకూడదని చెబుతారు. ఆరోజున పొరపాటున చంద్రుడిని చూసినా అనవసరంగా నిందలు మోయా ల్సి వస్తుందని పండితులు చెబుతారు. ఎందుకంటే చంద్రుడిపై వినా యకుడు శాపం విధించాడు. గణశుడి ఆకారం, ఇబ్బందులను చూసి చంద్రుడు ఎగతాళి చేయడం వల్ల ఈ శాపానికి గురయ్యాడు. ఈ శాపం ముఖ్య ఉద్దేశ్యం ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎవ్వరినీ చూసి నవ్వకూడదు. ఎగతాళి చేయకూడదు. అయితే తన తప్పు తెలుసుకున్న చంద్రుడు వినాయకుడిని క్షమించమని కోర తాడు. దీంతో వినాయకుడు శాంతించి సంకష్టి వ్రతం ఆదరించి ఉప వాసం ఉండేవారు చంద్రుని దర్శనం తర్వాతే ఉపవాసం విరమిం చాలని చెబుతాడు.
సాధారణంగా కొందరు ఏకాదశి వంటి రోజున రెండు పూట లూ ఉపవాసం ఉంటారు. అయితే సంకష్టి వ్రతం సమయంలో రెండు పూటలు ఉపవాసం ఉండకూడదని చెబుతారు. అలాగే చం ద్రుడికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి. చతుర్థి పర్వదినాన పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పం డ్లను తీసుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు.
ఈ రోజున, భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. వినా యకుని ప్రార్థనలతో ముందుగా చంద్రుని దర్శనం/మంగళకరమై న దర్శనం తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు. వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు, తెలివితేటలకు అధిపతి వినా యకుడు. చంద్రకాంతి ముందు, గణపతి ఆశీర్వాదం కోసం గణప తి అథర్వశీర్షాన్ని పఠిస్తారు. ప్రతి నెలలో, వినాయకుడిని వేర్వేరు పేర్లతో, పీటతో పూజిస్తారు. ప్రతినెలా ఈ చతుర్థి రోజున
‘సంకటహర గణప తి పూజ’ ప్రార్ధ న చేస్తారు. ఈ పూజలో ప్రతి నెలకు ఒకటి, 13వ కథ అధిక మాసం కలిపి మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతం ప్రత్యేకత ఏం టంటే, ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి. ఈ పవిత్రమైన రోజున తమ కుటుంబం, పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని, అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకుం టూ వినాయ కుడిని పూజిస్తారు. సంకష్టి చతుర్థి రోజున ఈవిధంగా ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement