Thursday, May 2, 2024

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాల‌న్న‌ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప‌క్కాగా రూపొందించాల‌ని మంత్రి హ‌రీశ్ రావు ఆదేశించారు. బీఆర్కే భవన్ లో వైద్య ఆరోగ్య సమీక్ష నిర్వ‌హించారు. ఈస‌మీక్ష‌లో మంత్రి మాట్లాడుతూ… డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం ప్రారంభించేలా సిద్దం‌ కావాలని మంత్రి ఆదేశించారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫెర్ కమిషనర్ వాకాటి‌ కరుణ, డెరెక్టర్ ‌హెల్త్ శ్రీనివాస్‌రావు, ఓఎస్డీ గంగాధర్ లతో కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి, ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తెలంగాణ హెల్త్ పోఫైల్ లో ప్రస్తుతం ఎనిమిది‌ టెస్ట్ లు చేస్తున్నారని, అదే తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా అయితే 57 టెస్ట్ ‌లు చేయవచ్చని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

తెలంగాణ డయాగ్నసిస్ లో ఉపయోగించే ఎక్విప్ మెంట్ ద్వారా ఆక్యురేట్ గా రిజల్ట్ వస్తాయన్నారు. వేగంగా పరీక్షలు నిర్వహించవచ్చని, రోజుకు పది టెస్ట్ లు చేయవచ్చన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి‌ ఆరోగ్య సమాచారం తీసుకోవాలన్నారు. నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా‌ చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ ఎలా తయారు చేయనున్నారో, ఆ వివరాలను మంత్రి హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు‌ తెలిపారు. ఈ జిల్లాల్లో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి‌ సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుతుందన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించ‌వ‌చ్చన్నారు. ఈ పరీక్షలు పూర్తయిన వారి ఆరోగ్య సమాచారం‌ డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని, అందులో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్లిప్తం చేయటం‌ జరుగుతుందని మంత్రికి వివరించారు.

ప్రయోగాత్మకంగా రెండు‌ జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండాలన్నారు. ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి యాక్సిడెంట్ కు గురయినా అతని ఆరోగ్య ‌సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అదే రీతిలో‌ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించ‌వ‌చ్చ‌న్న‌దే సీఎం ఆలోచన అని చెప్పారు‌. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి.‌. ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం, ఎలాంటి వైద్య నిపుణులు, అవసరమైన మెడికల్‌ డివైసెస్ అవసరమో తెలుస్తుందని చెప్పారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, డెరెక్టర్ హెల్త్ జి.శ్రీనివాస్‌రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాథర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement