Saturday, April 20, 2024

Big Story: అమ్మకానికి పెళ్లి కూతురు.. డిమాండ్ ఎక్కువైతే వేలం పాట‌..

ప్రపంచంలో మనకు తెలియని ప్రదేశాలు.. వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఒక దేశంలో అయితే ఏకంగా పెళ్లికూతుర్లకు ఒక సంత ఉందంటే నమ్ముతారా. అది కూడా స్వయంగా వారి తల్లిదండ్రులే అమ్మాయిల్ని అక్కడికి తీసుకొస్తారట. ప్రత్యేకంగా పెళ్లి కోసం ఏర్పాటుచేసిన సంత లాంటి ప్రదేశాలే ఇవి. ఈ అంగడిలో అమ్మాయిల పెళ్లి కోసం వేలంపాట కూడా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చదివి తెలుసుకుందాం…

బల్గేరియాలోని  స్తారా జాగోర్ ప్రాంతంలో అమ్మాయిల పెళ్లి కోసం ప్రత్యేక మార్కెట్ లేదా సంత నిర్వహిస్తారు. ఇక్కడికొచ్చే పెళ్లికొడుకులు తమకు నచ్చిన అమ్మాయిలను కొనుగోలు చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈ మార్కెట్‌కు వచ్చేవారిలో ఎక్కువమంది అమ్మాయిలు మైనర్లే ఉంటారని ఓ నివేదిక చెబుతోంది. వీరి వయస్సు సాధారణంగా 13 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది.

ఆ మార్కెట్లో అమ్మాయి నచ్చిన తర్వాత సదరు అబ్బాయి ఆ అమ్మాయిని భార్యగా భావించుకుంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా దీనికి ఒప్పుకోవల్సి ఉంటుంది. వారి రెండు కుటాంబాల మధ్య ఆదాయం, ఆస్థుల గురించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి ధర నిర్ణయించుకుని ఖరారు చేసుకుంటారు.

సంతకు వెళ్లేందుకు చాలా రోజుల ముందు నుంచే అమ్మాయిలు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువ అందంగా కన్పించాలన్నది వారి భావన. అందుకే మంచి దుస్తులు, మేకప్‌తో మార్కెట్‌కు వస్తుంటారు చాలామంది.

ఈ కమ్యూనిటీ ప్రజలు తమ అమ్మాయిలను పెద్దగా చదివించరని సమాచారం. సంతకు వచ్చే అమ్మాయిలకు ప్రధానంగా వంట వచ్చి ఉంటే చాలు. తక్కువ వయస్పు ఉన్నా పర్వాలేదని వారి ఆచారం. అబ్బాయికి అమ్మాయి నచ్చిన తర్వాతనే బేరం ఎంతనేది లెక్క తేలుతుంది. ఒక్కొక్క అమ్మాయికి 300 నుంచి 400 డాలర్లు చెల్లిస్తుంటారని అంచనా.

- Advertisement -

పెళ్లికూతుర్ల మార్కెట్ కళాయిజ్దీ సముదాయం తరపున ఏర్పాటవుతుంది. పెళ్లికూతురిని కొనుగోలు చేసేందుకు వచ్చేవారు కూడా ఈ సామాజికవర్గానికి చెందినవారే అయుంటారు. ఇక్కడికి బయటి సామాజిక వర్గపు వ్యక్తి రాకూడదు. ఈ కమ్యూనిటీలో దాదాపు 18 వేలమంది ఉన్నారు. ఈ సాంప్రదాయంతో అక్కడి అమ్మాయిలకు కూడా ఎటువంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదట. ఎందుకంటే ముందు నుంచే ఇక్కడి అమ్మాయిల్ని మానసికంగా అందుకు సిద్ధం చేస్తారు.

పెళ్లికూతుర్ల మార్కెట్‌లోకి తల్లిదండ్రులే అమ్మాయిలను తీసుకొస్తారు. ఇక్కడికి పెళ్లికూతుర్లను కొనుగోలు చేసే పెళ్లికొడుకులు, బంధవులంతా వస్తారు. ఎవరెక్కువ వేలం పాడితే వారితో తమ అమ్మాయి వివాహం ఖరారు చేస్తారు ఆ తల్లిదండ్రులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/gujjarswagg/status/1317299902754541568
Advertisement

తాజా వార్తలు

Advertisement