Tuesday, May 14, 2024

జనార్థన స్వరూపం…అమలక వృక్షం!

ప్రతి సంవత్సరం #హందూ దేశంలో జరుపుకునే పండగలు… పబ్బాలలో ఒక్కొక్క రోజు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ వృక్షం, ఆమ్ర పుష్పం, అలాగే అమలక ఫల విని యోగం చేయడం సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. కార్తీకం నుండి చైత్రం వరకు ఆరు మాసాలలో అమలకిని పచ్చిదానిని ఏదోవిధంగా వాడాలని పెద్దల నిర్దేశం. ఏడాదిలో వచ్చే ఏకాద శులు విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రికాదశి ఏర్పడ గా, ఒక ”పండు” (ఉసిరిక)తో సంబంధించి ఏర్పడింది ఒక్క అమలకి ఏకాదశి మాత్రమే. స్మృతి కౌస్తుభం, కృత్యసార సముచ్చయం, తిధితత్వం మున్నగు గ్రంథాలు కార్తీక మాసంలో అమలకి వృక్ష మూలాన ఉసిరిక కాయల తో, ఉసిరిక పత్రితో దైవారాధన చేయాలని, తులసితో పాటు కాయతో ఉసిరిక కొమ్మను పూజించాలని, ఉసిరిక చెట్టు నీడన అన్నం వండాలని, ఉసిరిక పండ్లు కలిపిన నీటితో స్నానం చేయాలని, పూర్ణిమ నాడు ఉసిరిక ఫల దానం చేయాలని, శిరస్సు, ముఖం, #హస్తం, దే#హమందు ఉసిరిక పండు ధరించాలని వివరిస్తున్నాయి. ఉసిరిక చెట్టు నీడ సోకే కొలనులో స్నానం చేయాలని, ఉసిరిక మాని కింద అరుగు మీద ఆవాసం, పూజ, భోజనం చేయాలని పెద్దల ఉవాచ. అలాగే ఫాల్గుణ మాసంలో మళ్ళీ ఉసిరిక వినియోగం ఉంది. ”అమలకే వృక్షే జనార్ధన: అని అమదేర్‌ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటు న్నాయి. అమలక వృక్షం జనార్ధన స్వరూపమని, దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించా లని ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు అమలకీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలుపుతు ంది. సంస్కృతంలో అమలకానికి గల పర్యాయ అమలకం గుణమును ధరించున ది. పదాలు… రాత్రి దాది వంటిది. వ్యస్థ- వయస్సున నిలుపునది, ఫలర వ- సారవంతమైనది. అమృతం వంటిది. శీతఫలి- శీతవీర్యము కలది. ప్రాణమును నిలుపునది కనుక ఉసిరికాయ అనునది సార్ధక నామ మని కొందరి భావన.
ఒక పేద ఇల్లాలు ఉసిరి కాయలు భిక్ష పెట్టగా, ఆదిశంకరు లు కనకధారా స్తవం చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం కురి పించారని చెపుతారు. ఇక వైద్యోపయోగానికి వస్తే.. షడ్రసా ల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు దీనిలో ఉన్నాయి. ఇది మ#హత్తర ఓషధీ గుణం కలది. అమృతా ఫలమనే గ్రం థంలో దాని ఔషధీ గుణాలు, ఫల జాతులు గ్రంథంలో సర్వాంగాల యొక్క వైద్య, పారిశ్రామిక ఉపయోగాలు, వాగ్బంలో దీని రసా యనిక, కాయకల్పాది చికిత్స ఉపయోగాలు విపులీకృతమై ఉన్నా యి. ”కరతలామల కము” అనే సామెత తెలియని వారుండరు. అన గా అరచేతిలోని ఉసిరికాయ. ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరి కాయను భూగోళ మునకు ఉపమగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వ మును తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలా మలకమనే సామెతను ఉపయోగిస్తారు. సర్వ ప్రపంచ సదృశమై, భగవత్‌ స్వరూపమై ఉన్నదనే ఆమలకము దానమునకు ముఖ్యముగా వ్యవ#హరించబడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement