Tuesday, May 28, 2024

మౌన ‘మే’లునోరు!

మౌనము- వాక్కు వల్ల వచ్చే దోషాన్ని హరిస్తుం ది. పరమేశ్వరుడు ఇచ్చిన వాక్కును నిలబెట్టుకో వడానికి దానికి విశ్రాంతి కల్పించి ఆ వాక్కు వలన ధన్యత పొందవచ్చు. మనసు, వాక్కు, కర్మలనే త్రికరణాలలో మనసుతో చేసే వాటికే ఫలితం ఉం టుంది. జ్ఞానేంద్రియమైన జిహ్వ ఎన్నో పలుక వచ్చు. అవి మనస్ఫూర్తిగా కానప్పుడు వాటి ఫలి తం ఉండదు. అలాగే హృదయపూర్వకంగా చేయ ని కర్మ కూడా ఫలితాన్నివ్వదు. అందుకే మనం ఏ పనిచేసినా త్రికరణశుద్ధిగా చేయాలంటారు. మ నం మన మనసును దేనిమీదైనా లగ్నం చేసినప్పు డు వాక్కు కర్మలపై దృష్టి ఉండదు. వాటి ప్రభా వం ఉండదు. అగ్ని ఆవహంచి ఉన్నది దహంచు కుపోవడమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నవాటిని కూడా దహంచి వేస్తుంది. వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తుంది. అలాగే కోపం ఉన్నవాడు తాను ఉద్రేకపడడమే కాకుండా ఎదుటివారిని కూడా ఆవేశపరుస్తాడు. అది వాదోపవాదాలకూ, ఘర్ష ణలకూ దారితీస్తుంది. కోపానికీ మాటకీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు. ఎవ రూ ఎక్కువకాదు. ధనము, వస్తు వాహనాలు, ఆభరణాలు ఇలాంటి వాటిల్లో ఎక్కువ తక్కువ లు చూసుకుంటే ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఒ క రోజు ఉంటాయి, మరుసటి రోజు పోతాయి. వీటిని చూసుకొని తామే గొప్ప అని భావిస్తే చివర కు ఏమీ లేనివారిగా మారుతారు. అందుకే ఏది శాశ్వతమైనదో ఏది నిత్యమైనదో ఏది సత్యమైన దో తెలసుకొని ఆ తర్వాత మాట్లాడితే అపుడు మాటలు కన్నా పరమాత్మ గురిం చి తెలుసు కోవడమే మేలనిపి స్తుంది. మన మాటలు, చేతలు ఇతరులను వేధించకూడదు. బాధ కలిగించకూ డదు. ప్రతి మనిషి తోటి వారికి సాయం అందిం చాలి. మనకు సాయంచేసే వారికే కాకుండా, అప కారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలగ డం దైవత్వం. ఇది అందరికీ రాదు. కానీ ఎవరికీ హాని చేయకపోవడ మే అన్నింటికన్నా మంచిది.
వ్యాసుడు పరులకు ఉపకారం చేయడమే పు ణ్యకార్యమని పరులకు అ#హతం చేయడమే పాప కార్యమని చెప్పారు కదా. అందుకే మనం మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకూడదు. ఎదుటి మనిషికే కాదు ఏ ప్రాణికీ చెడు చేయకూడ దు. ప్రకృతిలో ఉన్న నీరు, గాలి, చెట్లు అన్నీ పరోప కారం చేస్తూ మనిషిని కూడా స్వార్థం మానుకొని ఇతరులకు సాయం చేయాలని చెప్తుం టాయి.
పినతల్లికి తన తండ్రి ఇచ్చిన మాట కోసం పధ్నాలుగు సంవత్సరాలు భార్య, తమ్ముడు సహా వనవాసం చేస్తాడు శ్రీరామచంద్రుడు. సీతాదేవిని నిందించిన మాటను కూడా భరించలేక, నిండు చూలాలిని అరణ్యాలకు పంపు తాడు శ్రీరాముడు.
చక్కగా మాట్లాడడం ఒక కళ. ఎక్కడ మా ట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ సందర్భమిది అన్నదాన్ని జ్ఞప్తిలో ఉంచుకుని మరీ మాట్లాడాలి. బాగా తెలిసినవారు ఎంత అవ సరమో అంతవరకే మాట్లాడతారు. అనవసరపు మాటలు మాట్లాడి ఎవరినీ ఇబ్బందిపెట్టరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement