Thursday, May 9, 2024

విని గమన న్యాయము

ఒక విషయాన్నిగానీ వస్తువును గానీ రెండు కోణాల్లోంచి చూసినా, రెండు విధాలుగా సాధించడానికి వీలున్నప్పుడు గానీ ఫలి తములో ఎలాంటి వైరుధ్యం రాకుండా సాధించవలననే నియమ మును వినిగమనము అంటారు.
దీనిని ఎక్కువగా పంచాంగం రూపొందించేటప్పుడు పరిగణ నలోకి తీసుకుంటారు. పంచాంగంలో చెప్పబడే వివిధ విషయాలు సూర్య చంద్ర గమనాల ఆధారంగా సూర్య సిద్ధాంతము ప్రకారము దృగ్గణిత పద్ధతి ప్రకారము గ్ర#హస్థితులలో కొన్ని తేడాలు వస్తూనే ఉంటాయి, అలాంటి తేడాలు లేకుండా వుండేవిధంగా వినిగమన మును తీసుకుంటారు.
ఇవన్నీ చదువుతుంటే కొంచెం అయోమయం కలుగుతుంది కానీ విషయాలను జాగ్ర త్తగా గమనిస్తే ఈ ”వినిగమన న్యాయము” అంటే ఏమిటో తెలుసుకోగలం.
మొదట పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుంటే కొంత మనకు అవగా#హన కలుగు తుంది. పంచ అంటే ఐదు. అంగ అంటే అంగాలు. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యో గం ఈ ఐదు భాగముల యొక్క కలయికే పంచాంగం.
ఈ పంచాంగాన్ని చంద్రుడి గమనంతో అనుసంధానం చేసి రూపొందిస్తే చాంద్రమాన పంచాంగం అని, సూర్యుని గమనంతో అనుసంధానం చేసి రూపొందిస్తే సూర్యమాన పం చాంగం అని అంటారు. పంచాంగంలో రాసిన కాలములకు, విషయాలకు సరిగ్గా ఆకా శమందు దృశ్యములు గోచరిస్తే లేదా కనిపిస్తే అది దృక్సిద్ధ పద్ధతి లేదా దృగ్గణిత పద్ధతి అం టారు. దృక్‌ అంటే కన్ను. కంటికి ప్రత్యక్షంగా కనిపించే లేదా గోచరమయ్యే గణితమని అర్థం.
అంటే ఖచ్చితమైన సమయాల్లో ఖచ్చితముగా గ్ర#హణాలను కంటి ద్వారా చూడటా నికి అవకాశం ఉంటుందని చెప్పిన గణితాన్ని దృగ్గణితము అంటారు.
అన్నీ కంటికి కనబడవు కదా! అలాంటి లోపాలను సూర్య సిద్ధాంతమును అవలంబిం చి సరిచేసుకొని పంచాంగం రాస్తారు. సూర్య సిద్ధాంతం అనేది #హందూ మతస్థుల ఉపయో గించే ఒక ఖగోళ శాస్త్ర సిద్ధాంతము.
ఈ సిద్ధాంతంలో గ్రహాల కదలిక, వాటి స్థితి, దిశ, ప్రదేశము, సమయము, సూర్య, చం ద్రుల కక్ష్య, నక్షత్రాలు, సూర్యోదయం, అస్తమయం… మొదలైన అంశాలు వుంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని పంచాంగం రాస్తారు. దీనిని మాననం చేస్తూ రాయడా న్ని సూర్య మానం అంటారు. ఈ సూర్య మానానికి సంవత్సరం పునాది.
ఇక చాంద్రమానం అంటే చంద్రుని గమ నాన్ని బట్టి తిథులు, వారాలు, నెలలు, సంవత్సరాలను నిర్ణయించుకునే విధానం. తెలుగు, కన్నడ వారి పంచాంగ ములు, క్యాలెండర్లు చాంద్రమానం ప్రకారం ఉంటాయి.
చాంద్రమానానికి నెల ఆధారం. నెల అంటే ఒక పౌర్ణ మి నుండి మరో పౌర్ణమి వరకు గాని లేదా అమావాస్య నుం చి అమావాస్య వరకు గాని లెక్కిస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కాలాన్ని ఒక నెలగా లేదా మాసంగా లెక్కిస్తా రు. చాంద్రమానం 30 తిథులు ఉన్నప్పటికీ చం ద్రుడు భూమి చుట్టూ తిరుగడానికి 27. 32 రోజులు మాత్రమే పడుతుంది. దీనివల్ల చాంద్రమానానికి, సూర్యమానానికి మధ్య తేడా తలెత్తుతుంది. దానిని సమన్వయం, సర్దుబాటు చేసేందుకు వీలుగా చాంద్ర మానంలో అధిక మాసం అనే పేరుతో ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా మన తెలుగు వారు చాంద్రమానం ప్రకారంగానే పండుగలు జరుపుకుం టారు. ఇలా చాంద్రమానం, సూర్యమానానికి మధ్య, అలాగే సూర్య సిద్ధాంతానికి, దృగ్గణిత ములో గ్ర#హస్థితులను బట్టి వచ్చే తేడాలను సరిచేసి ఏవిధమైన వైరుధ్యం కలుగకుండా మధ్యే మార్గంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ యొక్క నియమమును వినిగమనము అంటారు. ఈ ”వినిగమన న్యాయము”లో ఇంత సమాచారం దాగివుంది.
ఈ న్యాయాన్ని మానవ జీవితానికి అన్వయించినట్లయితే… ఏవైనా సమస్యలు అంటే కుటుంబం, మతపరమైన, మానవీయతకు సంబంధించిన ధర్మ సందేహాలు, సమస్యలు వచ్చినప్పుడు పట్టువి డుపుల విషయంలో ఇరువైపులా కోపతాపాలకు తావులేకుండా, ఎలాంటి వైరుధ్యాలు పొడసూపకుండా, ఏవిధమైన తేడాలు రాకుం డా మధ్యే మార్గాన్ని అనురింపచేసేట్లు ఈ ”వినిగమన న్యాయము” తో పోల్చి చెప్పవచ్చు.
ఈ నాయముతో ఏకత్వాన్ని సాధించవచ్చని మనం తెలుసుకోగలిగాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement