Tuesday, May 7, 2024

సీపీ అంజ‌నీ కుమార్ కి లీగ‌ల్ నోటీసులు..ఎందుకో తెలుసా..

డ్రగ్స్ తనిఖీల సమయంలో పోలీసులు ఫోన్ చాటింగ్‌లు పరిశీలించడం సరికాదని, కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని ఐసీ ఎక్స్‌పర్ట్ కె. శ్రీనివాస్.. సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల వెస్ట్‌జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా కె.శ్రీనివాస్‌.. సీపీకి లీగల్ నోటీసులు పంపించారు. అక్టోబరు 27వ తేదీన హైదరాబాద్‌ పరిధిలోని మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, జుమేరాత్‌బజార్‌ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కాగా ఈ తనిఖీల సందర్భంగా పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని, తక్షణమే వాటిని గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.వాహన తనిఖీల్లో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై అనుమానం ఉంటే స్పాట్ లోనే అన్ని ఆధారాలను పరిశీలిస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తి ఐడెంటిటీ కోసం ఆయన వద్ద ఉన్న ఐడి ప్రూఫ్స్ పరిశీలిస్తామని చెప్పారు. నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలో ఓ క్రిమినల్.. కానిస్టేబుల్ ను కత్తి తో పొడిచాడని సీపీ తెలిపారు. ఆ నేపథ్యంలోనే అనుమానితులను అన్ని రకాలుగా పరిశీలించామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement