Tuesday, May 21, 2024

మాస్ మ‌హారాజ్ 70వ చిత్రం..ఆక‌ట్టుకుంటోన్న పోస్ట‌ర్..

ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్ లో న‌టించ‌నున్నాడు హీరో ర‌వితేజ‌. ఇది మాస్ మ‌హారాజ్ కి 70వ చిత్రం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. దేవాలయాలపై ఉన్న బొమ్మల్ని ఫోకస్ చేస్తూ ప్రీలుక్ ని రిలీజ్ చేయడమే గాక.. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్న క్యాప్షన్ ని ఇచ్చారు. స్వామిరారా తరహాలోనే ఏదో థ్రిల్లింగ్ సబ్జెక్ట్ నే సుధీర్ వర్మ ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. నవంబర్ 5న టైటిల్- ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఏదో సంథింగ్ మ్యాజిక్ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement