Monday, April 29, 2024

బిగ్ బాస్5లో పండ‌గ వాతావ‌ర‌ణం..సంద‌డి చేసిన ప‌లువురు సెల‌బ్రిటీలు..

బిగ్ బాస్5 హౌస్ లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపించింది. ఆదివారం ఎపిసోడ్ ని చాలా స్పెష‌ల్ గా సాయంత్రం ఆరు గంట‌ల నుంచే షో ను ప్రారంభించ‌నున్నారు. టాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ శ్రియ హౌస్ లోపలికి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్లను స‌ర్ ప్రైజ్ చేసింది. త‌న హాట్ స్టెప్పుల‌తో హౌస్ ని హీటెక్కించింది. శ్రియ రావడం రావడమే నాగార్జునకు హగ్ ఇచ్చింది. ఆ తరువాత కంటెస్టెంట్స్ లను త‌న‌దైన శైలిలో ప‌లికరించింది.ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని చూసే నేను సిగ్గు పడడం నేర్చుకున్నా.. అని కామెంట్ చేసింది. ఇక శ్రియ తర్వాత హీరోయిన్ అవికా గోర్ కూడా ఓ మాస్ సాంగ్ కు స్టెప్పులేస్తూ… హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా కంటెస్టెంట్ల‌తో ముచ్చ‌టించింది.

ఇక ఇత‌ర డ్యాన్స‌ర్ల పెర్ఫార్మెన్స్ ల‌తో షో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఆ త‌రువాత‌.. దేవ‌రకొండ బ్ర‌ద‌ర్స్.. విజ‌య్, ఆనంద్ లు ఇద్ద‌రూ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్ల‌తో మాట్లాడుతూ సంద‌డిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆనంద దేవరకొండకు సిరి ఐ లవ్ యు ఆనంద్ అని చెప్పడంతో నాగార్జున కోపం తెచ్చుకుని మొన్న నాకు చెప్పావు.. ఇప్పుడు ఇత‌నికి ఎందుకు చెబుతున్నావు ఇది కరెక్ట్ ఏనా అని అడిగితే, అది మొన్న ఇది ఇప్పుడు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది సిరి. ఆనంద్ దేవ‌ర కొండ హీరోగా నటిస్తున్న పుష్ప‌క విమానం సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల అవుతున్న మూవీ ప్రమోట్ చేస్తున్నాడు ఆయన అన్నయ్య విజయ్ దేవరకొండ.

మరోపక్క బిగ్ బాస్ హౌస్ మాజీ కంటెస్టెంట్, సింగ‌ర్ కల్పన కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ చాలా ఆస‌క్తికరంగా మారింది. ష‌న్నుపై ఓ స్పెష‌ల్ సాంగ్ పాడింది. త‌నదైన రేంజ్ లో ఆక‌ట్టుకుంది. త‌నదైన శైలిలో కంటెస్టెట్ల మీద పంచులు వేసింది. దీంతో ష‌న్ను సిగ్గు పడుతున్నట్టుగా చూపించారు. అనంత‌రం బుల్లితెర స్టార్ యాంక‌ర్ సుమ‌.. త‌నదైన మాటల తూటాలు పేల్చి.. న‌వ్వులు పూవ్వులు కురిపించింది. మీరు కూడా యాంక‌రింగ్ వైపు వ‌స్తే.. నా లాంటి వాళ్లు ఏమై పోవాలి అని ప్ర‌శ్నించింది. నువ్వేమైన త‌గ్గువ‌నా.. 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చావు అంటే నీది ఎంత బిజీ షెడ్యూల్ లో అర్థమవుతుంది అనడంతో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని అనడంతో అవును నాకు కూడా ఇస్తున్నారు కదా అంటూ చాలా స‌ర‌దాగా సాగింది వీరిద్ద‌రి సంభాష‌ణ ఆసక్తికరంగా మారింది.ఇక మాజీ కంటెస్టెంట్లు దివి, మోనాల్ గజ్జర్ తో అందమైన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. అలాగే ముక్కు అవినాష్, బాబా మాస్టర్ లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. కంటెస్టెంట్ల‌కు ఫ‌న్నీ టాస్కులు ఇచ్చి .. న‌వ్వుల పువ్వులు పూయించారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇమిటేట్ చేసి చూపించారు. దీపావ‌ళి కోస‌మే స్పెష‌ల్ గా ఈ హంగామా అంతా అని ప్రోమో చూస్తే అర్థ‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement