Saturday, July 27, 2024

ధర్మానిదే జయము!

అపవాది యగువాని నటు చంపవలవదు తానాడు కల్లలే తన్ను జెఱుచు
సర్వకంటకు నెందు సాధింప వలవదు వసుధవారలగోడు వాని జెఱుచు
నతి మూర్ఖుడగువాని నదలింప వలవదు తనలోని కోపమే తన్ను జెఱుచు
గడునహంకారిని గాదనవలదు మేని గర్వంబె మిగుల జెఱుచు
జెప్పవలవదు బుద్ధులీ చెనటులకును/ సత్యవిదులకు ధర్మమే జయముగాన
కలిత సంకాశ! సర్వజగన్నివేశ! వేంకటేశ!

తాత్పర్యం: అపవాదిని చంపవద్దు, వాడు మాట్లాడు అబద్ధాలే వాడిని చెరుస్తాయి, లోక కంటకుడగు వాడిని సాధించవలదు. భూమి లోని ప్రజల గోడే వాడిని చెఱుచును, అతిమూర్ఖుడగు వానిని హచ్చరింపవలదు, వాటిలోని కోపమే వానిని జెఱచును, అహంకారిని ఎదురించవద్దు వాడిలోని గర్వమే వాడిని మిగుల జెఱచును, చెడ్డవారికి బుద్ధులు చెప్పవద్దు, సత్యవిధులకు ఎప్పుడూ
మంచియే జరుగును ధర్మమునకే చివరకు జయము కలుగును.

Advertisement

తాజా వార్తలు

Advertisement